మెడికల్ కాలేజీ కోసం ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు : మాజీ ఎమ్మెల్యే అమ్రాజుల శ్రీదేవి

Published: Monday May 31, 2021

బెల్లంపల్లి, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఇతరులు ప్రకటనలు ప్రయత్నాలు చేస్తున్న ప్రజా ప్రతినిధులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే అమ్రాజుల శ్రీదేవి  అన్నారు. శనివారం నాడు విలేకరులతో మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనేకమంది ప్రజలు ప్రజాస్వామ్య వాదులు విద్యార్థి మేధావి వర్గాలు డిమాండ్ చేస్తున్న, ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మాత్రం నోరు విప్పడం లేదని ఆమె అన్నారు. స్థానిక శాసనసభ్యులు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని ఎంపిపి, లు మండల నాయకులు తమ తమ కార్యాలయాలనుండి తీర్మానాలు చేసి పంపించాలంటే ఎంత సమయం పడుతుందని ఆమె అన్నారు, చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్థానిక సంస్థల అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తీర్మానాలు చేసి తీర్మానాల కాపీలను ముఖ్యమంత్రికి పంపించాలని ప్రజలు మిమ్మల్ని ప్రతినిధులుగా ఎన్నుకున్నది మౌనంగా ఉండేందుకు కాదని ప్రజల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టి ప్రభుత్వానికి ప్రజావాణి వినిపించడానికని అది జరగని నాడు సాధారణ పౌరుడికి మీకు తేడా ఏమిటని అన్నారు, ప్రతిపక్షాలు పోరాడి సాధించే పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి స్థానిక సంస్థల అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా తమకున్న  ఒకే ఒక అవకాశం తీర్మానాలు చేసి పంపించడమని  లేదంటే నియోజకవర్గ స్థాయి నాయకులందరూ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి కలిసి తీర్మానం కాఫీలను అందించాలని కార్యాచరణ అనేది లేకుండా కూర్చుంటే పక్కకు పోయే ప్రమాదం ఉందని ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అందరూ తమ తమ కార్యాలయాల నుండి తీర్మానాలు చేసి ముఖ్యమంత్రికి పంపించే ప్రయత్నాలు చేయాలని ఆమె  విజ్ఞప్తి చేశారు.