ప్రతి కుటుంబానికి దళిత బందు అమలు చేయాలి

Published: Monday December 26, 2022

జన్నారం, డిసెంబర్ 25, ప్రజాపాలన: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి దళితులకు దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని, తెలంగాణ తెలుగుదేశం ఉమ్మడి అదిలాబాద్ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజేశ్వర్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మాట్లాడుతూ దళితుల అభివృద్ధి రిజర్వేషన్ సాధించాలని ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యూనిట్ల పంపిణీలో జాప్యం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళిత వర్గాల వారు దళిత బంధు కోసం ఎదురు అభ్యర్థిస్తున్నారని తెలిపారు. దళితుల ఉద్యమ సంఘాల ఆధ్వర్యంలో దళిత బంధు పథకం యూనిట్ల కంపెనీలో జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరు దళితులకు దళిత బంధు యూనిట్ల ను పంపిణీ చేయాలని ఆయన సూచించారు. దళితులకు దళిత బందు పథకం సాధించు కొనుటకు దళితులకు సాధికారిత మద్దతు తెలుపుతామని మాట్లాడారు. అనంతరం దళితులందరికీ వెంటనే దళిత బంధు పథకం కల్పించాలని రాష్ట్ర, జిల్లాలో అన్ని గ్రామాల మండలాలలో కమిటీలు వేయడం జరుగుతుంది జరుగుతుందని తెలియజేశారు. వెంటనే దళిత బందు ప్రకటించాలి. అర్హులైన వారందరికీ దళిత బంధు ఇవ్వడం కోసం దరఖాస్తు చేసుకున్న అందరూ దళితులకు దళిత బంధు యూనిట్లను పంపిణీ చేయాలని ఆయన సూచించారు.