టి ఎస్ ఆర్ టి సి ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు

Published: Monday May 02, 2022
మధిర మే ఒకటి ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో టి ఎస్ ఆర్ టి సి డిపో ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు మేడే సందర్భంగా ఘనంగా నిర్వహించి చి ఆఫీస్ వద్ద మేడే కార్యక్రమం ఘనంగా జరిగినది, మేడే కార్యక్రమానికి జెండా ఆవిష్కరణ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె అరుణ కుమారి ఆవిష్కరించారు, మధిర డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీ తిమ్మినేని రామారావు, సిపిఐ మధిర పట్టణ బాధ్యులు శ్రీ బెజవాడ రవి, వక్తలు ప్రసంగిస్తూ ప్రపంచ కార్మికులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, 136వ మేడే కార్యక్రమం విశిష్ట వివరించారు, ఈ కార్యక్రమంలో  నాగరాజు ఎస్కే రహీం, బి వెంకటేశ్వర్లు, అంజయ్య కాలేశా, అరుణ శ్రీనివాసరావు, ఓట్ల కొండలరావు, లక్ష్మణ్, మరియు ఏ ఐ టి యు సి నాయకులు కార్మికులు భారీ ఎత్తున కార్యక్రమం జరిగినది.