పురాతన దేవాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం

Published: Saturday December 17, 2022
బోనకల్ డిసెంబర్ 16 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలో,లక్ష్మీపురం గోవిందాపురం రెండు గ్రామాల మధ్య వేయి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతన దేవాలయం రెండు గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి గాయత్రీ మాత, భక్తాంజనేయ స్వామి, ధ్వజస్తంభం శిధిల అవస్థకు చేరినవి కనుక ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ శివ శుభ కృతమ సంవత్సర మార్గశిర బహుళా అష్టమి శుక్రవారం అనగా డిసెంబర్ 16వ తారీకు శుక్రవారం ఉదయం 7:56 నిమిషములకు ఉత్తరా నక్షత్ర యుక్త ధనుర్లగ్నం పుష్కరాంశం, నందు, రుత్వికులు కేతముక్కల సురేష్ శాస్త్రి, మేడేపల్లి రామకోటయ్యచారి, వేద పండితుల, నడుమ మంగళ వాయిద్యాలు వేదమంత్రాలతో సుముహూర్తమున రెండు గ్రామాల భక్తజనుల నడుమ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రెండు గ్రామాల భక్తులు పాల్గొని నవధాన్యాలు సమర్పించి స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో, చైర్మన్ ఆలయ ధర్మకర్త, కిలారు రామ కోటేశ్వరరావు. గోవిందపురం సర్పంచ్ ఉమ్మినేని బాబు, లక్ష్మీపురం ఇన్చార్జి సర్పంచ్ గుడ్డురి ఉమా, బెజవాడ మల్లికార్జునరావు, ఉమ్మినేని కోటయ్య. శ్రీనివాస చారి రెండు గ్రామాల భక్తులు పాల్గొన్నారు.