తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోఘనంగా పరిటాల

Published: Wednesday January 25, 2023
18 వ వర్ధంతి వేడుకలు మధిర జనవరి 24 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ పరిటాల రవీంద్రవర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ *వాసిరెడ్డి రామనాథం ముఖ్యఅతిథిగా పాల్గొని, పరిటాల రవీంద్ర  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టు  భావజాలాలఉన్న పరిటాల ఎన్టీఆర్ పార్టీ లో చేరి రాయలసీమలో తన ప్రజ్ఞా పాటవాలతో ధ్యేర్య సాహసాలతో అక్కడి ఫాక్షన్ రాజకీయాలకు ఎదురొడ్డినిలిచి  పేద బడుగు బలహీన వర్గాలకు వ్యవసాయ కార్మికులకు రైతులకు మహిళలకుఅండగావుంది  ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు  ఎంతోమంది పేద  జంటలకు వివాహాలు జరిపించేవాడని పలువిధాలగా సహాయం చేసేవారని తెలిపారు ఈ క్రమంలో గుండాల వలన  తనకు ప్రాణహాని ఉందని తెలుసికుడా  ప్రజలను కాపాడేవారు   పరిటాల రవి టీడీపీ పార్టీ ఆఫిసులో మీటింగ్ లో ఉండగా అప్పటి పృభుత్వం అండజూసు కొని కాల్పులు జరిపి హంతకులు పరిటాలను హత్య గావించటం ప్రజలు ఇప్పటికి మరచిపోలేదని వారు తెలిపారు వీరుడు ఎప్పటికి మరణించడని అని అన్నారు వారి మరణం పార్టీకి తీరని లోటుఅని వారి సతీమణి పరిటాల సునీత వారి కుమారుడు పరిటాల రామ్ టీడీపీలో వుంటూ ఆలోటును కనపడకుండా వారి వారి రాజకీయ సేవలద్వారా శ్రమిస్తున్నారని రామనాధం అన్నారు  
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చేకూరు శేఖర్ బాబు, టౌన్ పార్టీ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు, రూరల్ మండల అధ్యక్షుడు మారనీడు పుల్లారావు, పట్టణ కార్యదర్శి చెరుకూరి కృష్ణారావు, దేవ భక్తుని వెంకట్  కాశీరావు సట్టు వెంకటేశ్వరులు చెన్నం స్వామి తదితరులు పాల్గొని పరిటాల చిత్రపటానికి నివాళులు అర్పించి పరిటాలను అందరూ స్మరిం చుకున్నారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని  అదే పరిటాలను అర్పించే నిజమైన నివాళి అని అన్నారు