కరీంనగర్‌ ఆగష్టు 7 ప్రజాపాలన

Published: Monday August 08, 2022
స్నేహాన్ని మించింది మరోకటి ఈ లోకంలో లేదని,మనిషికెదురయ్యే బాదరాబందాలు స్నేహంతోనే దూరం కాగలవని ఏసీపీ ప్రతాప్ అన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్బంగా స్థానిక ప్రెస్ భవన్ లో
ఫ్రెడ్స్ కల్చరల్ అకాడమీ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజలో ‌ దేనినైనా కొనచ్చు గానీ, స్నేహాన్ని మాత్రమం కొనలేమన్నారు.ఈ జీవిత లముద్రాన్ని దాటడానికి స్నేహాన్ని మించిన నావ మరొకటి ఈ సమాజంలో లేదన్నారు.కలిమి,లేమి అనేది ఉండబోదని సమానంగా చూసేది ఒక్క స్నేహంలో ఉంటుందన్నారు.
 
స్నేహితుల దినోత్సవం సందర్భంగా  ఫ్రెండ్స్ కల్చరల్ అకాడమీ  ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజున  స్నేహితుల దినోత్సవం సందర్భంగా  గత 25 సంవత్సరాలుగా మా సంస్థ ద్వారా ఎందరికో ప్రతిభ గలవారిని ఎంపిక చేస్తూ అవార్డులను ప్రధానం చేస్తున్నామని ఫ్రెండ్స్ కల్తరల్ అకాడమీ వ్యవ్థాపక అధ్యక్షుడు సొల్లు అజయ వర్మ అన్నారు. ఈ సంవత్సరం కూడా యువతి,యువకులలోని ప్రతిభను గుర్తించేందుకు యువ ఎక్స్ లెన్స్  అవార్డు 2022 పలు రంగాలలో విశిష్ట సేవాలను అందిస్తున్న వారికి  ఉత్తమ సేవా పురస్కార్ 2022 ల ప్రధానోత్సవ వేడుకల మహోత్సవాన్ని జరుకుంటున్నామన్నారు.
 స్నేహానికన్న మిన్న లోకాన లేదురా స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహానికి వయసుతో సంబంధం లేదన్నారు.. ఆడైనా మగైనా స్నేహం స్నేహితులందరూ ఒక్కటేనని, నాకు ముఖ్యమైన స్నేహితుడు అన్నిటికీ అండగా నిలిచిన ప్రాణ మిత్రుడు బండి సంజయ్, అన్న కృష్ణ కిరణ్ మా అమ్మ మా నాన్న నా ప్రాణ స్నేహితులు ఇలాంటివారి గడపడం నా అదృష్ట భావిస్తున్నాని అజయ్ గుర్తు చేసుకున్నారు.అకాడమీ ప్రధాన కార్యదర్శిమిలినియం శ్రీనివాస్ కేక్ కట్ చేశారు.
*ఈ కార్యక్రమంలో  కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ,  కార్పొరేటర్ భాగ్యలక్ష్మి, ప్రశాంత్, డాక్టర్ బండి అభినవ, అమ్ము స్వచ్చంద సంస్థ చైర్మన్ సుజాత రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గోన్నారు.