త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ: మాజీ సర్పంచ్ ఎస్ కే వజీర్

Published: Monday July 11, 2022
బోనకల్, జులై 11 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని, రావినూతల, గ్రామంలో ముస్లింలు ఆదివారం నాడు బక్రీద్ పండుగ ను ఘనంగా జరుపుకున్నారు మసీదు, లను అందంగా ముస్తాబు, చేసి ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా రావినూతల మాజీ సర్పంచ్, ఎస్ కే వజీర్ మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగని , బక్రీద్ అంటే ఇబ్రహీం తన ఏకైక కుమారుడు ఇస్మాయిల్ ను బలి ఇవ్వటానికి సిద్ధమవుతాడని, ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారని తెలియజేశారు.త్యాగా నెరతితో పాటు స్వార్థం, అసూయా ను విడిచిపెట్టి మానవత్వం వెదజల్లాల్లన్నదే బక్రీద్ పండుగ లోని పరమార్ధమని తెలిపారు.అన్ని గుణాలలో దానగుణం గొప్పదని ఆకలి అనేది అందరికి సమానమైనది కనుక ఈ పండుగ నాడు శక్తి కొలది నిరుపేదలకు దానా ధర్మాలు చేస్తారని తెలియచేసారు. మతం ఏదైనా మానవత్వం గొప్పదని తెలిపారు.