అడ్డుగా ఉన్న రెకుల షెడ్డును తొలగించాలి

Published: Thursday February 16, 2023

జన్నారం, ఫిబ్రవరి 15, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందన్ పెల్లి గ్రామంలో తమ ఇళ్లుకు అడ్డంగా ఉన్న రేకుల షెడ్డు సంబందిత అధికారులు తొలగించాలని ఇంటి యాజమాని చుంచు వినయ్ కోరారు. మెయిన్ రోడ్డు అనుకొని తాము ఇంటిని నిర్మించుకున్నామని గత కొన్ని సంవత్సారాల క్రితమే ఇదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి( వెంకటరమణ) తమ ఇంటికి అడ్డంగా రేకుల షెడ్డును వేసి అందులో కిరాణ దుకాణం ను నిర్వహిస్తున్నాడని తెలిపారు. ఇంటి నుండి రాకపోకలు సాగించేందుకు తమకు రేకుల షెడ్డు అడ్డంకి గా మారిందని ఎన్ని సార్లు తొలగించాలని కోరిన సదర వ్యక్తి గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన వాపోయాడు. గతంలోనే  ఈ  విషయంపై మంచిర్యాల జిల్లా కలెక్టర్, మండల ఏంపీవోకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని ఇప్పటికైన అధికారులు స్పందించి రేకుల షెడ్డును తొలగించాలని కోరారు. తన ఇంటికి అడ్డుగా ఉన్న షెడ్డును తీసివేసి ఇప్పటికైనా తమ బాధను నెరవేర్చాలని ఆయన వాపోతున్నాడు.