గ్రంధాలయ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్ ను సన్మానించిన బీసీ నేతలు

Published: Friday June 11, 2021
జగిత్యాల జూన్ 10 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నూతనంగా నియమితులైన బీసీ ముద్దు బిడ్డ డా.గొల్లపెల్లి చంద్రశేఖర్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా బీసీ  సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముసిపట్ల లక్ష్మి నారాయణ, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జాజాల రమేష్, బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి అనుమల్ల సాంజేయ్ సామ్రాట్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తిరుపురం రాంచందర్, జాజాల శ్రావణ్ కలిసి శాలువతో సన్మానించి అభినందనలు తెలిపారు.