హైదరాబాద్ ప్రజా పాలన ప్రతి, నవంబర్ 20 బండ్ల గూడ జాగిర్ అరమైసమ్మ దేవాలయ ప్రాంగణంలో జంట నగరాల కు

Published: Monday November 21, 2022

ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమ్మద్ అలీ , ఎం.ఎల్.సి ఎగ్గే మల్లేశం , కర్ణాటక మాజీ మంత్రి రెవన్న , జోగులంబా గద్వాల్ జిల్లా  జెడ్.పి చైర్మన్ సరితతిరుపతయ్య ,  క్యామ మల్లేష్ , కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కురుమలు అందరూ గర్వపడే విధంగా ఎనిమిది కోట్లు పెట్టి ఆరమైసమ్మ ఆలయాన్ని  పునరుద్ధరించారని , వచ్చే సంవత్సరం నుండి ఇలాంటి సమ్మెళనలు మాకు సీఎం కేసీఆర్ గారి ఇచ్చిన ఆత్మ గౌరవ భవనం లో జరుపుకుంటాం అని ఎం.ఎల్.సి ఎగ్గే మల్లేశం తెలిపారు.  సీఎం కేసీఆర్ గారు కురుమలకు పెద్ద పీట వేస్తూ గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర కురుమలను ఆదుకుంటున్నందుకు  వారికి మా కురుమల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎం.ఎల్.సి ఎగ్గే మల్లేశం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో కురుమ సోదరులకు  పెద్ద పీట వేస్తూ ముందుకు తీసుకెళ్తూనందుకు చాలా సంతోషంగా ఉందని కర్ణాటక మాజీ మంత్రి రెవన్న తెలిపారు.వీటితో పాటు యాదగిరిగుట్ట ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.