మంథన్ గౌరెల్లి గ్రామంలో ఉపాధి హామీ పని కల్పించాలని గ్రామ పంచాయతీ ముందు తెలంగాణ వ్యవసాయ కార్

Published: Tuesday March 08, 2022
ఇబ్రహీంపట్న మార్చి 7 ప్రజాపాలన ప్రతినిధి : ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రెటరీ పి.అంజయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తీసివేసి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు  ఉపాధి హామీ పని అప్ప చెప్పిన తర్వాత కూలికు అందని ద్రాక్షoల ఉంది. మంతన్ గౌరెల్లి గ్రామంలో 1500 మంది కూలీలు పనిచేస్తారు. ప్రస్తుతం 20 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఇప్పటికి అధికారులు పనులు గుర్తించక పోవడం కూలీలా దగ్గర దరఖాస్తులు తీసుకొక పోవడం దారుణం. కూలీలకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న వచర్స్ కి కూలీలకు 12 వారాల బిల్లులు రాకుండ పెండింగ్ లో ఉండి ఇప్పటికి ఇవ్వక పోవటం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి 73000 వేల కోట్ల రూపాయలు కేటాయించడం అంటే ఉపాధి హామీ  పతకాన్ని నిర్వీర్యం చేయడoలో బీజేపీ కుట్రలో భాగమే కూలీలకు వెంటనే పని కల్పించాలి. పెండింగ్ బిల్లులు చెల్లించాలి. సమ్మర్ అలవెన్స్ రద్దు చేస్తూ తెచ్చిన జీవో ను రద్దుచెలి. రోజు కూలీ 600 రూపాయలు ఇయ్యాలి. సంవత్సరానికి 200 రోజులు పనికల్పించాలి. మెడికల్ కిట్టు అందుబాటులో ఉండాలి. పేస్లిప్పులు ఇవ్వాలి. పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి. పని ముట్లు అందరికి ఇయ్యాలి. మేట్ల పరితోశోకం 6 రూపాయలు ఇయ్యాలి తదితర సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కార్యక్రమంలో ఉపసర్పంచి రమేష్ చందు ఉన్నారు. అనంతరం వ్యకాస కూలీలా, నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా కుమార్. కార్యదర్శిగా శ్రీరామలు  ఉపాధ్యక్షుడిగా సర్దార్ సహాయ కార్యదర్శి లావణ్య క్యాసియర్ హతీరాం కమిటీ సభ్యులుగా. కిషన్ మల్లయ్య బజన్ లలిత నానుకు నరేందర్ నందు యాదయ్య కూలీలు పాల్గొన్నారు.