"లీగల్ సర్వీసెస్ క్లినిక్ "

Published: Tuesday February 23, 2021

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 22 ( ప్రజాపాలన ) : వయో వృద్ధులకు అవసరమైన ఉచిత న్యాయ సేవా సహాయం కోసం సోమవారం ఆర్ డి ఓ కార్యాలయంలో ప్రత్యేక "లీగల్ సర్వీసెస్ క్లినిక్" ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని వికారాబాద్ ఆర్ డి ఓ ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వయో వృద్దులపై జరిగే దౌర్జన్యాలను అరికట్టేందుకు గాను వారి సంరక్షణ, సంక్షేమం కోసం ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని ఆర్ డి ఓ తెలిపారు. ఇతరులు కూడా ఈ న్యాయ సేవల కోసం ఆర్ డి ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీసెస్ క్లీనిక్ ను సంప్రదించాలని తెలిపారు. ప్యారా లీగల్ వాలంటీర్ రవి కుమార్ ద్వారా కౌన్సిలింగ్, న్యాయ సలహాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.