"వనమా ఇంటిని ముట్టడించిన జీజేపీ శ్రేణులు"

Published: Friday January 07, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని పాత పాల్వంచలో గల కొత్తగూడెం శాసన సభ సభ్యులు వనమా వెంకటేశ్వరరావు ఇంటిని ఈ రోజు బీజేపి పార్టీ ముట్టడించి ధర్నా నిర్వహించారు. రామక్రుష్ణ సజీవదహనం కేసులో రామక్రుష్ణ సెల్ఫీ వీడియో సంచలనం సృష్టించింది.ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ వనమా రాఘవ ను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.పంచాయితీల పేరుతో దగ్గరకు వచ్చిన రామక్రుష్ణని అతని భార్యను పంపిస్తే నే నీకు న్యాయం చేస్తాననడం మానవ మ్రుగంలా ప్రవర్తిస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయకుండా ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి కామాంధులను ఊరి నుండి బహిష్కరించాలని ఆవేశభరితంగా తెలిపారు. పార్టీ కార్యకర్తలు వనమా ఇంటి వద్ద వున్న ప్లెక్సీలను చించి వేసారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసి పాల్వంచ పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా కొంత ఉద్రుక్త వాతావరణం నెలకొంది.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కనగాల అనంతరాములు ముట్టడి కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి,పోనిసెట్టి వెంకటేశ్ళర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.