మనిషి ఉనికికి, జీవనానికి మట్టి మూలాధారం.ప్రపంచ మృత్తిక నేలదినోత్సవ కార్యక్రమంలో జడ్పీ చైర్

Published: Tuesday December 06, 2022

మధిర రూరల్ డిసెంబర్ 5 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయక శాఖ ఆధ్వర్యంలోమనిషి ఉనికికి, జీవనానికి మట్టి మూలాధారం అని ఆరోగ్యవంతమైన నేల ఉన్నప్పుడే ప్రపంచ వ్యాప్తంగా జనాభా ను పోషించడానికి కావాల్సిన ఆహరోత్పత్తి సాధ్యం అవుతుందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  పేర్కొన్నారు సోమవారం నాడు మధిర పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు ఉన్న రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవాళికి అందే ఆహారంలో 95% శాతాన్ని నేల అందిస్తుందని మిగిలిన 5% శాతం సముద్రాలు, నదులు మొదలైన వాటి నుంచి లభిస్తుందన్నారు అందుకే నేలను కాపాడుకునే లక్ష్యాలు నిర్దేశించుకునేందుకు ప్రతి ఏటా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ మృత్తిక దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. నేల సహజత్వం కాపాడటానికి ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడానికి అలానే పేదరిక నిర్మూలనకు కృషి చేసిన థాయిలాండ్ రాజు భూమిబోల్ గారి జయంతిని ప్రపంచ మృత్తిక దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగం పై ప్రత్యేక దృష్టి సారించారని అందులో బాగంగా రైతుకు అండగా ఉండేందుకు రైతు బంధు, రైతు బీమా , ఉచిత విద్యుత్ సరఫరా, పంట కొనుగోలు లాంటి ఎన్నో విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు అలానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో అటవీ శాతం పెరిగిందని తెలిపారు కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాఖ అధికారులుు ఏడివెంకటేశ్వరరావు, మాజీ  మార్కెట్ చైర్మన్ నాగేశ్వరరావు ఆత్మమ కమిిిిటీ చైర్మన్ కోటేశ్వరరావు మండల రైతుు బంధు సభ్యులు చావా వేణుప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.