శంకర్ హోమ్స్ కు ఇంకా రైతు బంధు రావడం సిగ్గుచేటు సీపీఐ కార్యదర్శి తిరుపతి మండిపాటు

Published: Saturday May 28, 2022
కరీంనగర్ మే‌ 27 _ప్రజాపాలన ప్రతినిధి : 
 
తిమ్మాపూర్  మండల రెవెన్యూ అధికారుల తప్పిదం వల్లే   రైతుబంధు ప్రభుత్వ ఖజానా
కు గండి పడుతుందని తిమ్మాపూర్ మండల సిపిఐ కార్యదర్శి బోయిని తిరుపతి ఆరోపించారు.
ఆర్థికంగా ప్రభుత్వ ఆధాయానికి తూట్లు పొడుస్తున్నా అధికారులపై శాఖాపర
మైన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. 
 కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రం లో తాసిల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న శంకర్ హోమ్స్ నిర్మించడం జరిగిందని, సర్వేనెంబర్ 299 (6 )ఎకరాల వ్యవసాయ భూమి అందులో నాలుగు ఎకరాలలో హోమ్స్ నిర్మించడం జరిగిందన్నారు.ఒక్కో హోమ్స్ 30 నుంచి 40 లక్షలకు రియల్టర్ అమ్ముకొని వెళ్లిపోయాడుని, అయినా కానీ నాలుగు ఎకరాలకు  ఇప్పటికి నాలుగు పర్యాయాలుగా రైతుబంధు పడడం జరిగుతుందన్నారు.  ఇదంతా ఎక్కడో కాదు తిమ్మాపూర్ తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి  శంకర్ హోమ్స్  ఇలా ప్రభుత్వ ఖజానా వృధాగా పోతున్న తిమ్మాపూర్ మండల  వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు    విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.ఇంతా జరుగుతన్నా సంబందిత  అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడవడమేనని తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు హోమ్స్ నిర్మించే సమయంలో నాల కన్వర్షన్  పర్మిషన్లు చూసుకొని ఉంటే  ఇంత ప్రభుత్వ సొమ్ము వృధాగా పోయేద కాదని ఆయన గుర్తు చేశారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతధికారులు తక్షణమే స్పందించి ఇన్ని సంవత్సరాలు ఇచ్చినటువంటి రైతుబంధు తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినా  అధికారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను  కోరారు.