ప్రజాపాలన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జడ్పి చైర్పర్సన్ దావ వసంతసురేష్

Published: Wednesday February 15, 2023

జగిత్యాల ఫిబ్రవరి, 14 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జడ్పి కార్యాలయంలో ప్రజాపాలన క్యాలెండర్ ను జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జర్నలిస్టులు అంకిత భావంతో పని చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విదంగా కృషి చేయాలని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల స్థలాలు అంశంలో విడతల వారీగా ఆదరికి అందే విదంగా ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని జర్నలిస్టులకు అండగా ఉంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడ మనోహర్ నంద, బోగ నాగ భూషణ్ , గొడిసెల రమేష్, ఇంద్రాల హరీష్, గన్నవరం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.