దళిత బంధు గురించి కాదు అసలు దళితుల గురించి మాట్లాడే అర్హత మీకు ఉందామండల కాంగ్రెస్ మదిర

Published: Tuesday July 19, 2022

జులై 18 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని మాట తప్పింది మీ ముఖ్యమంత్రి కాదా.దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీ నాయకుడుదళితులకు కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను వాళ్లకి కేటాయించకుండా వేరే పథకాలకు మళ్లించి దళితులకు మోసం చేసింది మీరు కాదాగ్రామాల్లో బీసీలుగా పదవులు అనుభవించిన వారిని ఎస్సీ గా మార్చి సర్పంచ్ చేసింది మీరు కాదా.50 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పాలనలో మధిర లో అంబేద్కర్ సెంటర్ నామకరణం చేసి విగ్రహం ప్రతిష్టించిందిమధిర పట్టణాన్ని గ్రామ పంచాయితి కంటే హీన స్థితికి తీసుకువచ్చింది మీరు కాదా.ఈ రోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశం లో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంసెట్టికిశోర్*మాట్లాడుతూదళితబందు గురించి కాదు అసలు దళితుల గురించి మాట్లాడే అర్హత ఈ ప్రభుత్వానికి కానీ ఈ నాయకులకు కానీ లేదు అన్నారు..
దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని మాట తప్పింది మీ ముఖ్యమంత్రి కాదా..అని దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తా అని చెప్పిన మీ నాయకుడు ఉరికి ఒకరికి ఆయన భూమి ఇచ్చారా.. మోసం చేసింది మీరు కాదా, దళిత బంధు అందరికి ఇస్తా అని అందరికి ఇచ్చారా కాంగ్రెస్ పార్టీ హయాంలో భట్టి విక్రమార్క గారి కృషి తో ఎస్సీ, ఎస్టీ,సబ్ ప్లాన్  ఏర్పాటు చేయబడినది దాన్ని అమలు చేయకుండా రద్దు చేసింది మీ నాయకుడు ఇది నిజం కాదా..ఇప్పుడు ఓటమి భయంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకే దళిత బంధు పథకం తెచ్చిన మాట వాస్తవం కాదా.. మధిర మండలంలో మహాదేవపురం గ్రామంలో 2001లో బీసీ కుటుంబంలో సర్పంచ్, ఎంపీటీసీ పదవులు పొంది అనుభవించిన వారికి 2019లో ఎస్సీగా కులాన్ని మార్చి సర్పంచ్ నీ చేసింది మీరు, మీ నాయకులు కాదా ఆ కేసు కోర్టులో నడుస్తున్న మాట వాస్తవం కాదా అన్నీ తెలిసి భర్తరఫ్ చేయనిది మీరు కాదా.. ఇదేనా దళితులపై మీకున్న ప్రేమ. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు దళితులపై మీకు ఎంత ప్రేమ ఉందో ప్రజలందరికీ తెలుసు
50 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పాలనలో మధిర లో అంబేద్కర్ సెంటర్ నామకరణం చేసి విగ్రహం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా మీరు ఏర్పాటు చేశారా... ఈ రోజు విగ్రహం నిలబెట్టి ఎదో చేసాం అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు...గత 40,50 సంవత్సరాలుగా మధిరలో బడ్డి కోట్లు పెట్టుకొని జీవిస్తున్న ఐదు వందల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వారి బతుకులు ఛిద్రం చేసి వారి కుటుంబాలను వీధి పాలు చేసింది మీరు కాదా.. మధిర ను సమస్యల వలయంలో నెట్టింది మీరు కాదా... రోడ్లు మొత్తం తవ్వి గుంతలు చేసి ఇప్పుడు కురుస్తున్న వర్షానికి ప్రజలు బయట కాలు పెట్టటానికి భయపడి పోయే స్థితికి తీసుకు వచ్చి ప్రజలను అసౌకర్యానికి గురి చేస్తుంది మీరు కాదామధిర పట్టణాన్ని గ్రామ పంచాయితి కంటే హీన స్థితికి తీసుకువచ్చింది మీరు కదా... జిల్లాలో మంత్రి  నియోజకవర్గం మరియు మీ ఎమ్మెల్యే లు ఉన్న నియోజకవర్గాల్లో పారదర్శకంగా దళితబందు పధకాన్ని అమలు చేశారా మేము ఇచ్చిన చింతకని మండలం,రొంపిమల్ల గ్రామానికి వెళ్లి  చూద్దాం రండి ఎవరు పారదర్శకంగా ఇచ్చారో.గతం లో కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులకు  ఇళ్లు,ఇళ్ల స్థలాలు ఇచ్చేవారు..మీరు వచ్చిన ఈ ఎనిమిది సంవత్సరాలలో రాష్ట్రం లో ఎక్కడ అయిన మీరు దళితులకు ఇళ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇచ్చారా.. ఇవ్వక పొగ ఇచ్చిన వాటిని లాక్కుంటున్నారు ఇదెనా దళితులకు మీరు చేసిన మేలు.మా వల్ల మా నాయకుడు మల్లుభట్టి విక్రమార్క గారి వల్ల మధిరలో సమస్యలు వచ్చినవి అంటున్నారు ఆ సమస్యలు ఏంటో తెలిపి మీరూ ఆ సమస్యలు ఎలా తీర్చారో పత్రికముకంగా తెలియచేయగలరుఅని అన్నారు
ఈ సమావేశంలో మధిర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు *చావా వేణు* మున్సిపాలిటీ కౌన్సిలర్ *మునుగోటి వెంకటేశ్వరరావు* ఐఎన్టీయూసీ నియోజకవర్గ ఇన్చార్జ్ *కోరంపల్లి చంటి* మండల సేవాదళ్ అధ్యక్షుడు *ఆదూరి శ్రీను,పగిడిపల్లి విజయకుమార్డేవిడ్* పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్రా ఉద్దండయ్య* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* పట్టణ ఐ ఎన్ టి సి అధ్యక్షుడు *షేక్ బాజీ* కాంగ్రెస్ నాయకులు *అయిలూరి సత్యనారాయణ రెడ్డి, రామారావు, మైలవరపు చక్రి, అది మూలం శ్రీనివాసరావు* మొదలగువారు పాల్గొన్నారు.