జె.ఎన్.టి.యు. పి.హెచ్.డి. అడ్మీషన్లో అవకతవకలు-విద్యార్థుల ఆందోళన

Published: Thursday November 18, 2021
హైదరాబాద్ 17 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి: జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో పి.హెచ్.డి. 2021 సంవత్సరం ప్రవేశం కొరకు పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. యుజిసి, సి.యస్.ఐ.ఆర్. మరియు ఏదైనా ఇతర ప్రభుత్వ సంస్థలచే జాతీయ స్థాయి పరీక్షల ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జె.ఆర్.ఎఫ్) పొందిన అర్హులైన అభ్యర్థుల నుండి పూర్తి-సమయ పి.హెచ్.డి. పరిశోధన ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ పద్దతి ద్వారా దరఖాస్తులు ఆహ్వానించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. పిహెచ్.డి. ఎంపికలో అవకతవకలు జరిగాయని న్యాయంగా సీటు రావాల్సిన విద్యార్థులకు అందలేదని, విద్యార్థులను ఎంపిక చేయడం లో పొరపాటు జరిగిందని విద్యార్థుల ఆరోపించారు. దీనిలో భాగంగానే బుధవారం నాడు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తమకు న్యాయం చేయాలని విద్యార్థులు ప్లే కార్డులతో యునివర్సిటీ  వైస్ ఛాన్సలర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను సంబంధించిన పోలీసు అధికారులు అరెస్టు చేశారు. న్యాయం కోసం వచ్చిన విద్యార్థులను అరెస్టు చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండిచారు.