త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్య ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Thursday November 10, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 9 (ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రజలకు త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జిల్లాలోని కేరమేరి మండలం జోడేఘాట్ లో కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు త్రాగునీటి కొరకు ఎలాంటి  ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, పర్యాటక ప్రాంతం అయినందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన రెండు పడగల ఇండ్ల పథకంలో భాగంగా జోడేఘాట్ ప్రాంతానికి 30 మంజూరు చేయడం జరిగిందని, వీటిలో 11 ఇండ్లు రూప్ స్థాయి వరకు నిర్మాణం పూర్తయ్యాయని, ద్వితా వాటి నిర్మాణాలను త్వరలోనే పూర్తి  నిర్మాణాలను త్వరలోనే చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం జోడేఘాట్ లోని ఆశ్రమ పాఠశాలను సందర్శించి  విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరు పట్టిక, మధ్యాహ్న భోజన స్టాకు రిజిస్టర్ లను పరిశీలించి, తరగతి గదులు శుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డి ఈ నిరంజన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.