కులాలను కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వ్యక్తి పై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

Published: Wednesday October 28, 2020
మేడిపల్లి, అక్టోబర్ 28 (ప్రజాపాలన) : చాకలి, మంగలి కులాలను కించపరుస్తూ  ప్రముఖ సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్లో  డాక్టర్. ఆర్ఎస్ రత్నాకర్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్ వాల్ పోస్ట్ ద్వారా కులాలను కించ పరిచే విధంగా కామెంట్స్ పోస్ట్ చేసినందువలన రత్నాకర్ పై తగు చర్యలు తీసుకోవాలని ఎంబిసి యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు కలుకూరి రాజు, చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి వట్టికోటి శేఖర్, ఉపాధ్యక్షులు రుద్రారపు శంకర్ లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ పోలీస్ ప్రసాద్ కు విజ్ఞప్తి చేశారు.
 
 సాకలోడి పెళ్ళానికి మంగలోడు విడాకులు ఇచ్చినట్లు కరోనా జబ్బొడి కోసం మందు తాగే వాడి మీద యానాం సర్కార్ టాక్స్ వేయడం ఎంది అని పోస్ట్ చెయ్యబడింది (వాటి ఆధారాలు జత చేయడం జరిగింది). అయితే అతని పోస్ట్ ఉద్దేశ్యం ఏమైనా అయన రెండు కులాలకు చెందిన మహిళలను, వారి క్యారెక్టర్ ను కించ పరుస్తూ, వారి ఆత్మగౌరవం దెబ్బ తీసే విధంగా ఉన్నాయని పోలీస్ కమిషనర్ కు తెలిపారు. సమాజంలో ఇప్పటికే అనేక రకాల వివక్షకు గురవుతున్న ఈ  రెండు అత్యంత వెనుక బడిన కులాలకు చెందిన మహిళలను మరింత బాధ పెట్టే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అత్యంత వెనుక బడిన కులాల ఐక్య వేదిక  ఎంబిసీ యునైటెడ్ ఫ్రంట్ తరుపున  ఫిర్యాదు చేశారు.