ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్

Published: Saturday September 24, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ప్రజా పాలన.
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని రైతు వేదిక నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,(62) మంది లబ్ధిదారులకు (62) లక్షల రూపాయల విలువ గల చెక్కులను... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారి చేతుల మీదుగా అందజేశారు...  
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ 
 ప్రజలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్ని వర్గాల ఆడబిడ్డలకు సర్కార్ కానుకగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ప్రత్యేక పథకాలన్నారు, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా సీఎం కేసీఆర్ గారు పనిచేస్తున్నారని సంక్షేభంలోనూ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలోని దేశంలోనే అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళ్తున్నారని అన్నారు, దేశంలో ఎక్కడా లేనివిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గారు ఆడబిడ్డలకు మేనమామగా మారి లక్ష 116 రూపాయలను పేద ప్రజలకు చెక్కు రూపంలో నేరుగా ఇస్తున్నారన్నారు, అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని కరోనా సంక్షోభంలో కూడా సీఎం కేసీఆర్ గారు సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాల అమలు చేస్తూ తెలంగాణలో మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచిన మానవతమూర్తి సీఎం కేసీఆర్ గారిని అన్నారు, బతుకమ్మ పండుగ సందర్భంగా  ఆడబిడ్డలకు చిరు కానుకగా ఇవ్వాలన్న లక్ష్యంతో 2017 నుంచి ఏటా కోటికి పైగా చేస్తున్నట్లు అని తెలిపారు, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పింఛన్లు, కెసిఆర్ కిట్టు లాంటి పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు, రాష్ట్రవ్యాప్తంగా 330 కోట్లను వెచ్చించి లక్షలాది మంది బతుకమ్మ చీరలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు, ఈఏడాది 24 విభిన్నమైన డిజైన్ లు 10 పదిరైకల్ ఆకర్షణమైన రంగులతో తయారుచేసిన చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు, బతుకమ్మ చీరల పంపిణీలతో ఆడబిడ్డల ముఖాలలో ఆనందం నేతన్నల జీవితాలలో వెలుగులు నిండాయని, తెలిపారు.. ఈ కార్యక్రమంలో అశ్వాపురం జడ్పిటిసి సూది రెడ్డి సురక్షణ మరియు మండుకుంట సర్పంచ్ మద్ది మల్లారెడ్డి వెన్న అశోక్ ఇతర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు..