శివాలయానికి తన్నీరు విశ్వనాథం జ్ఞాపకార్థం రూ.6 లక్షలు విరాళం శివాలయానికి రానున్న రోజుల్లో

Published: Monday February 20, 2023

బోనకల్,ఫిబ్రవరి 18 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని చోప్పకట్లపాలెం గ్రామంలో ని మలినాధ మహా నాగ శివాలయానికి ఆ గ్రామానికి చెందిన క్రీ.శే తన్నీరు విశ్వనాథం-సామ్రాజ్యం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు తన్నీరు కోటేశ్వరరావు-మాధవి దంపతులు రూ 5 లక్షలు, కుమార్తెలు శ్రీదేవి-వెంకటేశ్వరరావు, మంజు-రాముల కుమారులు శ్రీ నిఖిల్-శ్రీ లలిత, మానస లు రూ. లక్ష రూపాయలు నిత్య నైవేద్య ఖర్చులకు శివరాత్రి పర్వదిన సందర్భంగా శనివారం అందజేశారు. గతంలో కూడా వీరు నూతన శివాలయ నిర్మాణంలో భాగంగా ఇదే ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా వీరిని ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుబ్బారావు మాట్లాడుతూ..... శివాలయ నిర్మాణానికి వీరు చేసిన కృషి అమోఘమన్నారు. అందరి సమిష్టి కృషితోనే శివాలయాన్ని అద్భుతంగా నిర్మించుకొని నిత్యం పూజలు జరుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ..... గ్రామంలో నిర్మిస్తున్న శివాలయానికి తమ వంతు కృషి గతంలో చేశామని, ఇప్పుడు నిత్య నైవేద్యానికి తమ సహాయ సహకారాలు అందించామన్నారు. తాము ఎక్కడ ఉన్నా గ్రామాభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలు రానున్న రోజుల్లో కూడా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతల స్నేహితులు సుబ్బారాయుడు, శ్రీకాంత్, శుక్లవర్ధన్ రెడ్డి, సుబ్బారెడ్డి, గ్రామ సర్పంచ్ ఎర్రంశెట్టి సుబ్బారావు, ఉప సర్పంచ్ బోయినపల్లి వెంకటేశ్వర్లు, గ్రామస్తులు తాళ్లూరి రామారావు, మండెపూడి వెంకటేశ్వరరావు, మండెపూడి రామారావు, తన్నీరు రవికుమార్, తన్నీరు రాధాకృష్ణ, హరికృష్ణ, బోయినపల్లి పకీరయ్య, బొగ్గవరపు బసవయ్య, బొగ్గవరపు సోమయ్య, పోలబోయిన శ్రీకాంత్, బోయిన శేఖర్ బాబు, ఆలయ అర్చకులు రామకృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.