ఉదారతను చాటుకున్న చైర్మన్ ప్రదీప్ రెడ్డి..

Published: Tuesday April 12, 2022
విద్యా వాలంటీర్ కు వేతనం అందజేత..
తల్లాడ ఏప్రిల్ 11 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని కుర్నవల్లి సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్ రెడ్డి తన ఉదాహరణను చాటుకున్నారు. గ్రామంలో విద్యా వాలంటీర్ గా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న నాగమణికి రెండు నెలల వేతనం సోమవారం అందించారు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో  ఈ విషయాన్ని ప్రదీప్ రెడ్డికి సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన ఆయన విద్యా వాలంటీర్ ను నియమించి ఆమెకు ఈ వేతనాన్ని అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాంబాబు, ఉపాధ్యాయులు సురేష్, ఎస్ఎంసి చైర్మన్ అయిలూరి సుబ్బిరెడ్డి పాల్గొన్నారు.