పేదవాడికి భారంగా మారిన పెరిగిన వంట గ్యాస్ ధర.. గ్యాస్ కొనే డబ్బులు లేక కట్టెల పొయ్యి పైనే ఉంటా

Published: Friday January 06, 2023
సోంపల్లి గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన నడిపి టి లక్ష్మి గ్యాస్ కొనలేక కట్టెల పొయ్యి మీదనే వంటలు చేసుకుంటున్నా  పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా లక్ష్మిని అడగక మేము ఉండటానికి కూడా ఇల్లు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుండి సామాన్య. ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయిందని విపరీతమైన రేట్లు పెంచిందని పేదరికంలో ఉన్న కుటుంబాలు బతికే పరిస్థితి లేకుండా ఉందని అన్నారు.ఉంటానికి కూడా ఇల్లు సరిగా కట్టుకోలేని పరిస్థితి రోజు వారి కూలి 250 రూపాయలు రెక్క ఆడితే గాని డొక్క ఆడే పరిస్థితి రైతులు ఇస్తున్నా కూలి చాలా తక్కువ .నిత్యవసర సరుకులు రేట్లు 
భగ్గున మండుతున్నాయి వంట గ్యాస్ రేటు బిజెపి అధికారుల్లో రాకముందు 410 రూపాయలు ఉంది 2014లో బిజెపి అధికారంలోకి వచ్చాక వంట గ్యాస్ 1200 కి చేరింది మంచి నూనె గతంలో 60 రూపాయలు ఉండేది ఇప్పుడు 200కు చేరింది అదే కాదు జీఎస్టీ పేరుతో ప్రజల పైన బాదుడే బాదుడు బిజెపి ప్రభుత్వం అందుకోసం రానున్న కాలంలో బిజెపికి ప్రజలు సరైన పద్ధతిలో చెబుతారని ప్రజలు అంటున్నారు.