పట్లూర్ గ్రామంలో అండర్ డ్రైనేజ్ పనులు

Published: Tuesday November 15, 2022
సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 14 నవంబర్ ప్రజా పాలన : ఏ గ్రామానికి అయినా రహదారి డ్రైనేజీ వ్యవస్థలు సక్రమంగా ఉంటే ఆ గ్రామం పురోగతి సాధిస్తుందని పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ అన్నారు. సోమవారం మర్పల్లి మండల పరిధిలో గల పట్లూరు గ్రామంలోని పదవ వార్డులో వార్డు మెంబర్ చావూస్, ఉపసర్పంచ్ మోయిజ్ లతో కలిసి 2 లక్షల జిపి నిధులతో అండర్ డ్రైనేజ్ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవర దేశి ఇందిర అశోక్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి గల్లీ వాసులు ఎదురుచూస్తున్న అండర్ అండర్ డ్రైనేజ్ పనులను నేడు ప్రారంభించడం సంతోషం కలిగించిందని అన్నారు. ప్లంబర్ మోయిజ్ ఇంటి నుండి కుంటెని యేసు రత్నం ఇంటి వరకు అండర్ డ్రైనేజ్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న అపరిస్కృత సమస్యలను పరిష్కరించుటకు ప్రత్యేక చొరవ చూపుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా వెంటనే నా దృష్టికి తేవాలని సూచించారు గ్రామాభివృద్ధి లక్ష్యంగా మనమందరం కలిసికట్టుగా ఐకమత్యముతో కృషి చేద్దామని ఆకాంక్షించారు పారిశుద్ధ్య పనులను జిపి సిబ్బంది వెంట వెంటనే పూర్తి చేస్తున్నారని వివరించారు. తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించడానికి జిపి సిబ్బంది మీ ఇంటి దగ్గరికి వచ్చి సేకరణ చేసి డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్ ఆరిఫ్ 11వ వార్డ్ మెంబర్ బాలేష్ టిఆర్ఎస్ నాయకులు నర్సింలు మహమూద్ అలీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.