ఆళ్లపాడు గోర్రేల సోసైటీ లబ్ధిదారులకు అవగాహన సదస్సు సదస్సులో పాల్గోన్న, డాక్టర్ నాగేశ్వరరా

Published: Saturday August 27, 2022

బోనకల్, ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని అళ్లపాడు గ్రామ గొర్రెల సొసైటీ లబ్ధిదారులకు డాక్టర్ నాగేశ్వరరావు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరావు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమసబ్సిడి గోర్రేలు 2 వే విడత సబ్సిడీ గొర్రెలను పొందాలని ఒక లక్ష 75 వేల రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని దానిలో నుంచి లబ్ధిదారుడి వాటాగా 43,750 లబ్ధిదారుల వాటాగా బ్యాంక్ అకౌంట్ ద్వారా తమ ఎకౌంటు దానితోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కలెక్టరు ఎకౌంటు ద్వారా బ్యాంకులో డిపాజిట్ చేయాలని కోరారు. 2వ విడత వచ్చేటువంటి గోర్రేలను అందరు సద్వినియోగం చేసుకొని ఎవరైతే మిగిలిన వారు ఉన్నారో వారందరూ డిపాజిట్ చేసి గోర్రేలను పోందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు , సంఘం అధ్యక్షుడు వేంకయ్య, కార్యదర్శి కొండ, విటరున్నరి డా.. నాగేశ్వరావు, ఇన్చార్జి డా..నాగేంద్ర లబ్ధి దారులు పాల్గొన్నారు.