పాత దుస్తుల సేకరణ

Published: Monday February 14, 2022
మధిర ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ ప్రజలు ఆదివారం నాడు ఉదయం మధిర పట్టణ స్థానిక అజాద్ రోడ్డులో ప్రముఖ సామజిక సేవకుడులంకా కొండయ్య నివాసంలో గత 2012 నుండి స్వచ్చందంగా నడుపుతున్న మహాత్మాగాంధీ ఉచిత పాత బట్టల కేంద్రం (మహాత్మా గాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంక్) నకు మధిరలో పలువురు దాతలు తమ ఇంటిలో కొన్నాళ్ళు వాడి మోజు తిరిపోయిన బట్టలు లను మరొకరికి ఉపయోగకరంగా ఉండాలిని  మంచి మనసుతో ఈ బ్యాంకు కు వితరణ చేస్తున్నారు. ఈ బట్టలను సామజిక సేవకుడు లంకా కొండయ్య తన బృందం లో స్వచ్చందంగా పని చేసే వాలంటీర్లు ద్వారా  లేదా కొండయ్య స్వయంగా తీరిక సమయాలు సెలవు రోజుల్లో కొంత మంది దాతలు ఫోన్ చేస్తే వెళ్లి పాత దుస్తులు తీసుకొని వచ్చి, తన ఇంటిలో ఒక గదిని కేటాయించి ఆదివారం సాయంత్రం పేద ప్రజలకు సంచార జాతుల కుటుంబాలకు ఉచితంగా దానం చేయటం చేస్తున్నారు. ఇలా కాకుండ కొంత మంది నిరుద్యోగులు పేద కాలేజ్ విద్య ర్డులుఈ బ్యాంక్ వద్ద కు వచ్చి తమకు కావాలిసిన దుస్తులు సెలక్ట్ చే సుకొని తీసుకొని వాడుకుంటున్నారు. ఇలా ఎందరికో నిరుపేద ప్రజలకు ఉపయోగకరంగా ఈ బ్యాంక్ సేవలు ఉపయోగపడుతున్నవి. ఎందరో దయాహృదయులు ఈ కార్యక్రమంనకు చేయూత నీయటం అభినందనియం అని కొండయ్య అంటున్నారు. ఈ రోజు మధిర టౌన్ లో బట్టలు వితరణ చేసిన వారు ప్రముఖ టీడీపీ నాయుకులు శ్రీ మల్లాది హనుమంతరావు, ఉపాధ్యాయులు జాన్ కాంతారావు, వెంకట రమణ సిపిఎం మహిళా నాయకురాలు శ్రీమతి ఫణింద్ర కుమారి, మేడేపల్లి శ్రీనివాసరావు, కోనా ధనికుమార్ చలువాది శ్రీనివాసరావు ఇంకా ఎందరో  మహాను భావులు  స్వచ్చందంగా ముందు కొచ్చి బట్టలు వితరణ చేయటం వల్ల పేదప్రజలు అవసరాలు తీరుతున్నవి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు వెళ్ళుటకు సహకరిస్తున్న ప్రతిఒక్కరికి పేరు పేరున కొండయ్య హృదయ పూర్వక అభినందనలు తెలుపు తున్నారు.