ఘనంగా అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు

Published: Friday April 16, 2021
బీరుపూర్, ఏప్రిల్ 14 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ గ్రామంలోని ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ దళిత బహుజన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మహా మేధావి అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బదినపల్లి శంకర్ సుద్దాల తిరుపతి పుడూరి శేఖర్ పుడూరి సుధాకర్ లక్ష్మణ్ వంశీ రమేష్ గాలిపల్లి నరేష్ పుడూరి రవి సతీష్ పుడూరి రాజేష్ రవి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.