కన్నుల పండుగగా కళా ఉత్సవం

Published: Friday November 25, 2022
జిల్లా విద్యాశాఖ అధికారిణి రేణుకాదేవి
వికారాబాద్ బ్యూరో 24 నవంబర్ ప్రజా పాలన : చిత్రలేఖనం, జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, పాటల పోటీలు నిర్వహించామని జిల్లా విద్యాశాఖ అధికారిణి రేణుకా దేవి తెలిపారు. గురువారం జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో జిల్లాస్థాయి కళా ఉత్సవ పోటీలను డైట్ కాలేజ్ వికారాబాద్ లో నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి 45 మంది ఎంపిక చేయబడిన విద్యార్థులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారిని రేణుకాదేవి  మాట్లాడుతూ.. విద్యార్థి దశలో చదువుతో పాటు కళలలో కూడా ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. విద్యార్థి సమగ్ర అభివృద్ధి సాధించడమే విద్య యొక్క పరమ లక్ష్యం అని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు సెక్టోరియల్ అధికారి రవికుమార్ మాట్లాడుతూ పనిలో శ్రమలో అలసినపుడు కళలు సాంత్వన ఇస్తాయి. అలాగే విద్యార్థులకు ఒత్తిడిని తగ్గించడానికి కళలు సాయపడతాయి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా నవాబుపేట్ ఎంఈఓ గోపాల్, ప్రధానోపాధ్యాయులు ఏ. వీరకాంతం, ఎన్. మల్లేశం, చిన్నికృష్ణ పాల్గొన్నారు.
జిల్లా స్థాయిలో ఎంపిక అయిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలియజేసినారు.