పుట్టినరోజు సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ఆశీస్సులు తీసుకున్న డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ

Published: Tuesday February 15, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 14 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్  డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి నివాసంలో ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మంత్రిమల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డిలు శివ కుమార్ గౌడ్ తో కేక్ కటింగ్ చేయించి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోల్తూరి మహేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుర్ర శ్రీకాంత్ గౌడ్, పప్పుల అంజిరెడ్డి, కో ఆప్షన్ మెంబర్ రాందాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.