పోలీస్ శాఖ వారికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మిషన్ అంధచేత

Published: Monday May 31, 2021
కోరుట్ల, మే 30, ప్రజాపాలన ప్రతినిధి :కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సూచన మేరకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా. కల్వకుంట్ల సంజయ్ కరోనా కట్టడిలో కోరుట్ల లో అనునిత్యం శ్రమిస్తున్న పోలీస్ శాఖ వారి కొరకై కోరుట్ల ఇంచార్జ్ సి.ఐ. శ్రీనివాస్, ఎస్సై చిర్ర సతీష్ లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మిషన్ కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి తోట నారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనీల్, ప్రధానకార్యదర్శి గుడ్ల మనోహర్, మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, రైతు సమన్వయ జిల్లా అధ్యక్షులు చీటి వెంకట్రావు, కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.