ఘనంగా జరిగిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Published: Tuesday November 09, 2021
వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 08 నవంబర్ ప్రజాపాలన : టీ పిసిసి అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ స్వగృహంలో టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ కూడలిలో టపాసులు పేల్చి స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదే విధంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకు బీద ప్రజలకు సాయం చేసే ఉద్దేశంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్నాయక్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు రత్నా రెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు అనంత్ రెడ్డి, కౌన్సిలర్లు వేణుగోపాల్ రెడ్డి, మురళి, కాంగ్రెస్ నాయకులు రెడ్యానాయక్, కృష్ణారెడ్డి, జాఫర్, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, వెంకట్ రెడ్డి, ఖాలీద్, రహీం, శివానందం, ఆనంద్, హాజీ, పరుశరామ్ నాయక్  బుచ్చయ్య, రత్నం, మల్లేష్, నవీన్, విజయ్, సిద్దార్థ రెడ్డి, కరీం, మహేష్ బాండ్ తదితరులు పాల్గొన్నారు.