24వ డివిజన్ లో కరోనా బారినపడిన నిరుపేదలకు డ్రై రేషన్

Published: Wednesday June 09, 2021
బాలపూర్, జూన్ 08, ప్రజాపాలన ప్రతినిధి : వైయస్సార్ కాలనీ లో కరోనా బారినపడిన  నిరుపేదలకు డ్రై రేషన్ అందజేసిన స్థానిక కార్పొరేటర్. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 24వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగు రామ్ రెడ్డి చేతుల మీదగా కరోనా బారినపడి హోమ్ ఐసోలేషన్ ఉన్న నిరుపేద రెండు కుటుంబాలకు మంగళవారం నాడు మారి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ సాంబశివతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశానుసారంగా మారి స్వచ్ఛంద సంస్థ వారు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాలనీవాసులు అందరికీ విజ్ఞప్తి... కరోనా వచ్చినా వారు హోం ఐసోలేషన్ ఉన్న ప్రతి ఒక్కరు భయపడొద్దు.. మనోధైర్యం కోల్పోవద్దు దైర్యంతో మహమ్మారిని తరిమి కొడదామని, డాక్టర్ సలహాలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఏనుగు రామ్ రెడ్డి, మారి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ సాంబశివ, ఎల్ సంజీవ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.