విద్యార్థులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకే భద్రత

Published: Tuesday February 28, 2023

లేదు మధిర రూరల్ ఫిబ్రవరి 27 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు విద్యార్థులు పట్ల తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు భద్రత లేదు

ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాడుతాంఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్సోమవారం నాడు మధిర ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఏఐఎస్ఎఫ్ మధిర నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో వైద్య విద్యార్థి ధారావత్ ప్రీతి ఆత్మ హత్యకు  కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ర్యాగింగ్ భూతం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ కేఎంసి పి జి వైద్య విద్యార్థిని ధారావత్ ప్రీతి హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి మృత్యువు తో పోరాడి ఓడిన  దారావత్ ప్రీతి మరణించడం బాధాకరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ సంఘటనలో యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం అమ్మాయికి సరి అయిన ధైర్యం చెప్పేవారు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తున్నది .పేద కుటుంబం నుండి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన ఒక మెడికల్ విద్యార్థిని ఇలా అర్ధాంతరంగా జీవితం ముగించడం చాలా బాధాకరం తక్షణమే సీనియర్ విద్యార్థి అయినటువంటి సయూఫ్ ను వెంటనే శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్చేస్తున్నాం లేని పక్షాన రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నాగుల్ మీరా ఏఐఎస్ఎఫ్ మధిర నియోజకవర్గ  నాయకులు సాయి గోపి మండల నాయకులు వెంకట్ నాగార్జున సుమంత్ శ్రావణ్ సందీప్ రోహిత్ ప్రసాద్ ప్రణయ్ స్వాతి పాల్గొన్నారు.