కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Published: Friday June 18, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డ 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. గ్రామాలలోని నిరుపేద కుటుంబాలకు ఆదుకునేందుకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, షాదీ ముబారక్ కింద మైనార్టీల యువతుల వివాహల కోసం ఒక్కొక్కరికి 1 లక్ష 116 రూపాయలు అందజేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేయలేదని కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అమలు చేసిందని అన్నారు. మండలంలోని 7 గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులతో పాటు చేనేత చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ కె.నాగలక్ష్మి, ఎంపీపీ నూతి రమేష్ రాజు, స్థానిక సర్పంచ్ బోళ్ల లలితా శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొనపూరి కవిత, సర్పంచులు కీసర రాంరెడ్డి, ఏనుగు అంజిరెడ్డి, గూడూరు శివశాంత్ రెడ్డి, మద్దెల సందీప్ గౌడ్, ఎంపీటీసీలు తుమ్మల వెంకట్ రెడ్డి, మోటే నరసింహ, మత్స్యగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు డేగల పాండు, రెవెన్యూ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.