ప్రభుత్వ సంక్షేమ పథకాలే పార్టీకి అండ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు బిఆ

Published: Saturday November 26, 2022
మణుగూరు (ప్రజా పాలన.)
 
 
 
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం వాసవి నగర్ గిరిజన భవన్ నందు పినపాక నియోజకవర్గ  బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  ప్రత్యేక సమావేశమై రానున్న 2023 లో జరిగే ఎన్నికలలో, ప్రధాన ఎజెండాగా భావించి , పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేలా దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ
సీఎం కెసిఆర్ నాయకత్వంలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని,  రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు కిందిస్థాయి ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, రాబోయే రోజులలో ప్రతి గ్రామంలో అన్ని సంఘాలను అభివృద్ధి పరిచేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలని, ప్రతి 100 ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు విషయంపై  వివరించాలని, ప్రతి మండలంలో ప్రత్యేక సమావేశాలు అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించారు., బిఆర్ఎస్  పార్టీ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, పార్టీ  బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు., ఏమైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు, ప్రజాప్రతినిధులు నాయకులు కొత్త పాతని తేడా లేకుండా అందరూ కలిసి సమిష్టి నిర్ణయాలతో పార్టీ  బలోపేతానికి కృషి చేయాలని, పిలుపునిచ్చారు.,పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు, నియోజకవర్గం లోని సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్  నాయకత్వంలో నిధులకు కొరత లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, రానున్న రోజులలో మరింత అభివృద్ధి పథంలో నిలబెడతానని, అన్ని గ్రామాలలో డ్రైన్లు ,సిసి రోడ్ల ,నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు., పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులు అందజేస్తుందని, కోట్లాది రూపాయలు నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు అవుతున్నాయని వారు తెలియజేశారు, ప్రతి ఏజెన్సీ గ్రామానికి బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని , ఇంకా మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాల ను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోట్లాది రూపాయలు నిధులను వెచ్చించి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉస్తానని అన్నారు,రాష్ట్రంలోని సామాజిక వర్గాలకు స్థలాలు కేటాయించిన సీఎం కేసీఆర్ ఎంతో ఆదర్శప్రాయుల  అని అన్నారు, సీఎం కేసీఆర్  ఆలోచనల నుంచి వచ్చిన కుల సంఘాలకు ఆత్మగౌరభవనాలు నిర్మాణానికి తన నియోజకవర్గంలో అమలు చేసేందుకు విహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అన్నారు, మణుగూరులో అన్ని కుల సంఘాలకు ఆత్మ గౌరవ భవనాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నానని అన్నారు, రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ గారు సముచిత స్థానం కలిపిస్తున్నారు అన్నారు, గ్రామీణ ప్రాంతాలలో కుల సంఘాలు భవనాల నిర్మాణంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు, అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది అన్నారు.