గోవింద పురం ఏ గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

Published: Monday December 13, 2021
బోనకల్, డిసెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ భాగం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ దార సురేష్ గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ క్లినీంగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ బాగం శ్రీను వా‌సరావు మాట్లాడుతూ గ్రామం లో ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని మరియు స్కూల్ ను శుభ్రపరిచడం వాటర్ ట్యాంక్ క్లినీంగ్ చేయడం గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆదివారం అని శెలవు తీసుకోకుండా వచ్చి పని చేయడం జరిగింది. గ్రామ పంచాయితీ కార్యదర్శి హిమబిందు వర్కర్ కు దార సురేష్ మరియు రాములుకి అభినందనలు తెలియజేశారు.