జర్నలిస్టుల అత్యుత్తమ సేవలకు ఘనంగా సన్మానం

Published: Tuesday September 07, 2021
-జర్నలిస్ట్ డే సందర్భంగా విలేకరుల కు జ్ఞాపికలు బహుకరించిన వాసవి క్లబ్
మంచిర్యల బ్యూరో, సెప్టెంబర్06, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లాలో అత్యుత్తమైన సేవలు అందిస్తున్నా జర్నలిస్టులను సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో జర్నలిస్ట్ డే సందర్భంగా మంచిర్యాల వాసవి క్లబ్ నేతృత్వంలో విలేఖరుల ను ఘనంగా సన్మానం చేసి, జ్ఞాపికలు బహూకరించడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ కమిటీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాచం సతీష్, కేశెట్టి వంశీకృష్ణ లు మాట్లాడుతూ విలేఖరులు స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యంలో తమ పాత్ర పోషింస్తున్నారని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న నేడు సోసేల్ మీడియాలో ఎన్ని వదంతులు వఛ్చినా వాస్తవాల గుట్టు విప్పేది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నే అని అన్నారు. విలేఖరులు రాసిన వార్తలను మాత్రమే ప్రజలు నమ్మకం కలిగి ఉంటారని ,  ప్రతి విలేఖరి వాస్తవాలను ప్రతిబింబించాలని చూసించారు. రాజ్యాంగంలో నాలుగో స్టంబంగా ఉన్న మీడియా రంగం ఆదరణ కోల్పోతుందని అన్నారు. దీనిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలపై, రాజ్యంగ సంస్థల పై ఉందని అన్నారు. ఆరోగ్య కరమైన మీడియా ను అందరూ ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్ మాజీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్తో పాటు అక్షరం దినపత్రిక మంచిర్యాల జిల్లా బ్యూరో, సీనియర్ జర్నలిస్టు కలువల శ్రీనివాస్, ఇతర దినపత్రికల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.