కరోనా పేరుతో లక్షలు దోపిడి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులను అరికట్టాలని బీజేపీ నిరసన

Published: Monday May 17, 2021
మేడిపల్లి, మే16, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా బారినపడ్డ బాధితుల నుండి లక్షలు దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులను అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోరంగా విఫలమైందని చిల్కానగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా బీజేపీ పార్టీ పిలుపు మేరకు కరోనా వ్యాధిపై ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా చిలుకానగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో డివిజన్లో బీజేపీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ  సందర్భంగా గోనె శ్రీకాంత్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సామాన్యడికి కరోనా వైద్యం అందడం లేదని ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్స్ దోరకవు, ఆక్సిజన్ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వారు లక్షలు డిపాజిట్ చేస్తేనే బెడ్ అని కరోనా వైరస్ పేరుతో పేషెంట్స్ పరిస్థితిని అసరగా చేసుకోని ఇష్టం వచ్చినట్లు లక్షలలో బిల్లులు వేసి పేద, మధ్యతరగతి ప్రజల రక్తాన్ని దాగుతున్నాయనీ అన్నారు. వైద్యాని పూర్తిగా వ్యాపారం చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారనిి, ఒకవేళా రోగి మృతి  చెందితే పార్థివ దేహాన్ని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా లక్షలు బిల్లులు చెల్లించాలని తీవ్ర ఇబ్బందులకు గురిిి చేస్తున్నారని తెలిపారు. రెమిడిసివర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ ను బయట బ్లాక్ లో కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం రాష్ట్రంలో ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి దిద్దుబాటు చర్యలు తీసుకోని, కరోనా పేరుతో లక్షలు వసూలు చేసే ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టాలని అన్నారు. కరోనా వైరస్ ను ఆరోగ్య శ్రీ లో చేర్చి వైద్యం చేయాలి. ఆక్సిజన్, ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలి. ప్రభుత్వం కేటాయించిన ఫీజుల గైడ్ లైన్స్ పాటించని ప్రైవేట్ హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలి గోని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గోనె అంజయ్య ముదిరాజ్, దేవసాని బాలచందర్ ప్రధాన కార్యదర్శి సంఘీ స్వామి యాదవ్, బిజైవైయం అధ్యక్షులు డప్పు దత్తసాయి, దళిత మోర్చా అధ్యక్షులు దాసరి యాదగిరి, ఉపాధ్యక్షులు పలుగుల నరేష్ కుమార్, సత్యనారాయణ యాదవ్, తోట సమ్మయ్య పటేల్, గుర్రాల మల్లేష్ ముదిరాజ్, బ్రహ్మచారి, మనోజ్ కుమార్, మైదం రాజు, సాధు గౌడ్, పాశం రాజు, శివ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.