ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి. *వికలాంగుల పెన్షన్ పెంపు కోసం మార్చి 15న చలో

Published: Friday December 30, 2022
ఘనంగా ముగిసిన ఎన్ పి ఆర్ డి అఖిలభారత మూడో మహాసభలు

వికలాంగుల పెన్షన్ పెంచాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని ఆహార భద్రత మార్చ్ 15న చలో పార్లమెంట్ నిర్వహిస్తున్నామని ఎన్పి ఆర్డి అఖిలభారత అధ్యక్ష కార్యదర్శులు గిరీష్ కీర్తి, మురళీధరన్  పిలుపునిచ్చారు. గత మూడు రోజుల నుండి జరుగుతున్న ఎన్పిఆర్డి జాతీయ మహాసభలు గురువారం ఘనంగా ముగిసినవి.దేశవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న  తీర్మానాలు చేయడం జరిగింది.వీటి అమలు కోసం దేశవ్యాప్తంగా   ఉద్యమాలు నిర్వహించాలని మహాసభ పిలుపునిచ్చింది.
ధరల పెరుగుదలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ పెంచాలని 2011లో పెంచిన పెన్షన్  ఇప్పటివరకు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించింది. 2019 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సమస్యల పరిష్కారం రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలపై   డిమాండ్ చేశారు. ప్రతి వికలాంగునికి ఆహార భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకొవాలాని డిమాండ్ చేశారు గత ఎనిమిదేళ్ల నుండి రియాబిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, 2016 ఆర్పిడి చట్టం  నేషనల్ ట్రస్ట్ చైర్మన్ లను ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు మతోన్మాద భావజాలాన్ని  కేంద్ర ప్రభుత్వం వికలాంగుల్లో జోప్పించెందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు మహిళా వికలాంగులపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాల వలన వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనిఅన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు నూతన విద్యా విధానం రద్దు కోసం దేశవ్యాప్త ఉద్యమం చేయాలని మహాసభ తీర్మానించింది 2017 పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకంలో ప్రత్యేక జాబ్ కార్డులు మంజూరు చేసి పని కల్పించాలని మహాసభ తీర్మానించింది. సామూహిక ప్రాంతాలన్నీ అవరోధరైతంగా మార్చాలని డిమాండ్ చేశారు. స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వమే నడపాలని డిమాండ్  చేశారు. బడ్జెట్లో ఐదు శాతం నిధులు వికలాంగుల సంక్షేమానికి  డిమాండ్ చేశారు ప్రభుత్వ శాఖలన్నీ వికలాంగుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  డిమాండ్ చేశారు. ఆరోగ్య సౌకర్యం పునరావసౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు అంత్యోదయ రేషన్ కార్డు మంజూరు కోసం  డిమాండ్ చేశారు సంక్షేమ పథకాలు అన్నింటిలో వికలాంగులకు 25 శాతం అదనంగా కేటాయించాలని డిమాండ్ చేశారు అలిన్కో సంస్థ బిజెపికి జేబు సంస్థగా  విమర్శించారు తమ బడ్జెట్లో ఐదు శాతం నిధులు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారునూతన జాతీయ కమిటీ ఎన్నిక అఖిలభారత మహాసభల ముగింపు సందర్భంగా నూతన జాతీయ కమిటీ ఎన్నికయింది ఐదు మంది కేంద్ర కమిటీకి ఎన్నికైనారు,

నూతన కమిటీకి
ప్యాట్రన్ గా కాంతి గంగూలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నంబు రాజన్(సెంటర్ ),అధ్యక్షులుగా  గిరీష్ కీర్తి (కేరళ), ఉపాధ్యక్షులుగా  ఎం అడివయ్య (తెలంగాణ)అనిర్భన్ ముఖర్జీ (బెంగాల్) ఝాన్సీ రాణి (తమిళనాడు) ప్రధాన కార్యదర్శిగా మురళిధరన్ సెంటర్,
సహాయ కార్యదర్శులుగా రిషికేష్ (హర్యానా )సామ్య గంగూలీ (బెంగాల్) కైరెల్లి ఎంపీ (కేరళ ) కోశాధికారిగా కె ఆర్ చక్రవర్తి (తమిళనాడు)
కమిటీ సభ్యులుగా తెలంగాణ నుండి కె వెంకట్, ఆర్ వెంకటేష్, సాయమ్మ, ఎన్నిక అయ్యారు. జిల్లా కార్యదర్శి  జేర్కోని రాజు,