ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన చాంద్ బేగం

Published: Thursday February 24, 2022
మధిర ఫిబ్రవరి 23 ప్రజా పాలన ప్రతినిధి మధిర మండలం మాటూరుగ్రామం బుధవారం నాడు ఉపాధ్యాయురాలుజిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీమతి మహమ్మద్ చాంద్ బేగం 12 రకాల భాషల వర్ణమాలను మిర్రర్ ఇమేజ్ లో 30 నిమిషాల్లో పూర్తి చేసినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు చాంద్ బేగంను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేస్తూ మెడల్, మెమెంటో, సర్టిఫికెట్ బ్యార్జ్, పెన్, బుక్ ఆఫ్ రికార్డు స్టిక్కర్స్ పంపించగా, ఆ అవార్డును మధిర మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై ప్రభాకర్ చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా యంఇఓ శ్రీ వై ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న చాంద్ బేగం జాతీయ స్థాయిలో కూడా అవార్డుకు ఎంపిక కావడం విద్యాశాఖకు గర్వ కారణమయ్యారని ఈ ఒరవడిని మున్ముందు కొనసాగిస్తూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాటూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయికృష్ణమాచార్యులు ఎస్ఎంసి చైర్మన్ శ్రీ మెడిశెట్టి రామకృష్ణారావు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.