పార్టీ కార్యాలయం ప్రజా పోరాటాల కేంద్రం కావాలి. సీపీఎం రాష్ట్ర నాయకులు పి జంగారెడ్డి

Published: Friday May 20, 2022

ఇబ్రహీంపట్నం మార్చి తేది 19 ప్రజాపాలన ప్రతినిధి.ఆరుట్ల లో సీపీఎం కార్యాలయం ఈ రోజు రాష్ట్ర నాయకులు పెసర గాయల జంగారెడ్డి , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య  ప్రారంభించడం జరిగింది*

. మంచాల మండలం  ఆరుట్ల ఉద్యమాలకు, పోరాటాలకు కేంద్ర బిందువు అని, తెలంగాణ  సాయుధ పోరాటం, భూపోరాటం ,స్థానిక పోరాటాల్లో కీలకంగా వ్యవహారించి, ఎంతో మంది కార్యకర్తలను తయారుచేసి, ప్రజల కు, కార్యకర్తలను ఆదుకున్న చరిత్ర ఆరుట్ల కు ఉందని తెలిపారు. సుందరయ్య  జీవితం అందరూ తెలుసుకోవాలని ,సుందరయ్య లాంటి నిజాయితీ, నిస్వార్ధ నాయకులు ఇప్పటి రాజకీయాల్లో లేరని, వారి జీవితం ఆదర్శం చేసుకొని, వారి అడుగు జాడల్లో నడవాలని తెలిపారు.రాబోయే కాలంలో ఎర్రజెండా ఎగురవేయాలని తెలిపారు. పగడాల యాదయ్య  జెండావిష్కరణ చేయడం జరిగింది. మండల కార్యదర్శి శ్యామ్ సుందర్  సుందరయ్య గారి ఫొటో కు పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రావుల జంగయ్య, గ్రామ కార్యదర్శి పుల్లగాళ్ల గోపాల్,మండల కమిటీ సభ్యులు పోచమోని కృష్ణ, మార బుగ్గరాములు,కోండిగారి బుచ్చయ్య, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి యూసఫ్ అలీ, పిఎన్ఎం నాయకులు వినోద్, గణేష్, శాఖ కార్యదర్శులు పూజరి ప్రభాకర్, చిందం కృష్ణ,శంకరయ్య, విజయ్, చంద్రయ్య, అంజయ్య, మల్లేష్, భూపాల్,తదితరులు పాల్గొన్నారు.