కృష్ణకాంత్ పార్క్ లో కరాటే బెల్ట్ ల ప్రధానోత్సవం

Published: Monday March 29, 2021
అమీర్ పేట్, మార్చి 28, ప్రజాపాలన : ఆత్మరక్షణలో కరాటేను మించనది లేదని చిన్న తనం నుండే కరాటే శిక్షణను పిల్లలకు నేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు డి.సుదర్శన్ రెడ్డి, యూసుఫ్ గూడ కృష్ణకాంత్ పార్క్ లో కరాటే బెల్ట్ పరీక్షలు నిర్వహించారు. వీటిలో పాల్గొన్న చిన్నారులకు వారి టాలెంట్ ను గుర్తించి వారికి బెల్ట్ లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కోచ్ మరియు ఎగ్జామినర్ మోయినోద్దీన్, కోచ్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.