ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవహారాలే మోసపోకుండా చేస్తుంది

Published: Tuesday February 14, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 13 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవహారాలే మనుషులను మోసపోకుండా చేస్తుందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఫైనాన్షియల్ లెటరసీ వారోత్సవాలలో భాగంగా బ్యాంకర్లు ముద్రించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఇట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలు ఆర్థిక లావాదేవీలలో  మోసపోకుండా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఈనెల 13 నుండి 17 వరకు లిటరసీ క్యాంపులు నిర్వహించి సైబర్ నేరాలు, యాప్ ల ద్వారా రుణాలపై జాగ్రత్తలపై అవగాహన  కల్పించడం జరుగుతుందన్నారు.  ప్రజలు మోసపోకుండా ఆర్బిఐ ఆమోదం ఉన్న బ్యాంకుల ద్వారానే రుణాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, ఎల్ డిఎం రాంబాబు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.