సొసైటీ చైర్మన్ తనపై చేసిన ఆరోపణలు ఖండించిన సీఈవో కుంజ రామారావు....

Published: Tuesday January 10, 2023
అశ్వాపురం (ప్రజా పాలన ప్రతినిధి.)
 నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సొసైటీ చైర్మన్ కు సహకరించకపోవడమే సీఈఓ చేసిన తప్ప?జరిగిన పరిణామాలు చూస్తుంటే నిజమే అని అనిపిస్తుందని తుక్కని మధుసూదన్ రెడ్డి  చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు చైర్మన్ డి సి ఓ కు పదేపదే నా పై కంప్లైంట్ చేసి తను వాడుకున్న డబ్బులకు రసీదులు ఇవ్వకుండా ఆడిట్ జరగగానే ఆ అడిట్ రిపోర్ట్లో తన బండారం ఎక్కడ బయటపడుతుందని వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాలని వాటినే యదార్థమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అని సొసైటీ సిఓఈ ఆరోపించారు..
సీఈఓ కుంజ రామారావు తెలిపిన వివరాల ప్రకారం మొండికుంట సొసైటీ  చైర్మన్ తుక్కని మధుసూదన్ రెడ్డి సొసైటీ ఖర్చుల నిమిత్తం లెక్క పత్రం లేకుండా 5,20,000 తీసుకున్నాడని అడిట్ వస్తున్నా తీసుకున్న డబ్బులకు రసీదులుఇవ్వకుండా,బిల్లులు ఇవ్వకుండా తనని ఇబ్బంది పెట్టి ఆడిట్లో అవి తనేదో వాడుకున్నట్టు చెప్తున్నాడని ఆయన వాపోయారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ కూడా తనే డబ్బులు ఇప్పించారు వాటి కూడా లెక్క పత్రం చూపెట్టకుండా ఆడిట్లో వాటిని వచ్చే విధంగా చేశారు .తన తప్పులు బయటపడతాయని ఇవన్నీ సీఈవో చేసినట్టు నమ్మించారు సొసైటీ చైర్మన్ నేను జాయిన్ అయిన దగ్గర్నుంచి చైర్మన్ చేసే అక్రమాలకు అడ్డుగా ఉన్నానన్న కారణంతో అక్కసు తోనే ఈ పని చేశాడని బోరున విలపించాడు. నేనే తప్పు చేసుంటే నాకు మెమో ఇవ్వకుండా నన్ను వివరణ అడక్కుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని వాపోయాడు. ఆదివాసీ మండల కమిటీ ముందు చెప్పడం జరిగిందని దీనికి స్పందించిన జాక్ అధ్యక్షులు మాట్లాడుతూ మీ రాజకీయ కుయుక్తులకు మా ఆదివాసులకు ఏమి తెలియదని నీ తెలివితేటలు మాపై ప్రదర్శించవద్దని ఆదివాసి జాకు మండల అధ్యక్షుడు కుంజా రామారావు,పిసా కమిటీ మండల అధ్యక్షులు చాప ముత్తయ్య తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు తంగేళ్ల భద్రయ్య  తీవ్రంగా ఖండించారు . భద్రయ్య మాట్లాడుతూ  ఒక ఆదివాసీనని ఇబ్బందులు గురి చేస్తే సహించేది లేదని నిజా నిజాలు వెలుగులోకి రావాలంటే పూర్తిస్థాయి విచారణ చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోర్స దుర్గారావు బిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు సప్కా నరేష్ ,ఎలకం నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు.