మల్లాపూర్ మండల మహిళ నిరుద్యోగులకు శుభవార్త

Published: Wednesday December 08, 2021

మల్లాపూర్, డిసెంబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లాలో గిరిజన సంక్షేమ మిని గురుకుల పాఠశాల (బాలికలు) ఒడ్డె లింగపూర్ మరియు మల్లాపూర్ విద్యాలయంలో బోధనేతర సిబ్బంది అవుట్ సోర్సింగ్ పద్ధతి పై నియమించుటకు దరఖాస్తులు కొరవడుచున్నవని ప్రాంతీయ సమన్వయాధికారి శ్రీ డి.ఎస్ వెంకన్న గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీల వివరములు మిని గురుకులం ఒడ్డెలింగపూర్ అకౌంటెట్ (1), అర్హత డిగ్రీ బీ కామ్ కంప్యూటర్స్ జీతం:10,000, ఏ యన్ ఎమ్ (1) మరియు ఎస్ ఎస్ సి & ఎమ్ పి హెచ్ డబ్ల్యు జీతం 9,000 అలాగే మిని గురుకులం మల్లాపూర్ కుక్, కిచెన్ హెల్పర్, విద్య అర్హత 7వ తరగతి, జీతం 7500. కావున అర్హత ఆసక్తి గల గిరిజిన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కొరవడుచున్నవి, విద్య అర్హత జిరాక్స్ పత్రాలతో 19-12-2021 లోపు సంప్రదించగలరు. స్థానిక గ్రామం, మండల వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. దరఖాస్తులు సమర్పించవల్సిన చిరునామా హెడ్ మాస్టర్ & వార్డెన్ మినిగురుకులం ఒడ్డెలింగపూర్ పూర్తి వివరాలకు. +91 96521 41962 ఒడ్డెలింగపూర్, +91 95023 31270 మల్లాపూర్.