మధిర మండలం పట్టణ కాంగ్రెస్ సమావేశం

Published: Wednesday December 29, 2021
మధిర డిసెంబర్28 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో కేంద్రంలోని రెడ్డి గార్డెన్స్ సర్దార్ జమలాపురం కేశవరావు సభాప్రాంగణంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ ప్లీనరీ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర  శాసన సభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్కూర్ క్రాస్ రోడ్ వద్ద యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు, మహిళా కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క గారికి మంగళహారతులు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు దారి పొడవునా భట్టి విక్రమార్కగారి పై పూలవర్షం కుమ్మరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్అధ్యక్షతన ప్లీనరీ ప్రారంభమైంది. మధిర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ  కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగిన అనంతరం రెడ్డి గార్డెఏర్పాటుచేసిన సమావేశంలో మల్లు భట్టి విక్రమార్కహాజరై అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. కాంగ్రెస్ పోరాట ఫలితమే దేశానికి సిద్ధించిన స్వాతంత్రం, భారత రాజ్యాంగం. దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కల్పించినది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాదాన్ని అమలు చేయాలని బిజెపి, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు చేస్తున్న కుట్ర మోడీ సర్కార్ రాజ్యాంగం అమలు చేయకుండా కుట్ర పూరితంగా చేస్తున్న పాలనే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ అనేక త్యాగాలతో  ప్రజలకు అందించిన ఫలాలను, ఫలితాలను నేటి పాలకులు దూరం చేస్తున్నారు.పంచవర్ష ప్రణాళికలతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన బహుళార్థసాధక ప్రాజెక్టులు, మిశ్రమ ఆర్థిక విధానాలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థల ఫలాలను వాటి ఫలితాలతో అధికారంలోకి వచ్చిన బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు నేడు  వాటిని ప్రజలకు దూరం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు మోడీ సర్కార్ దారాదత్తం చేస్తున్నది. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వెనుక కార్పొరేట్ శక్తుల కుట్ర దాగి ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితిలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ పార్టీ, రైతులు చేసిన పోరాటంతో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నూతన వ్యవసాయ నల్ల చట్టాలను పరోక్షంగా అమలు చేయాలన్న కుట్రలో భాగమే ధాన్యం కొనుగోలు చేయమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకుండ చేస్తున్న రాజకీయంతో విసిగి వేసారిన రైతులు వారి భూములను తామంతట తామే కార్పొరేట్ శక్తులకు లీజుకు అప్పగించాలన్న కుట్రలో భాగంగానే పరోక్షంగా బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆడుతున్న రాక్షస క్రీడ. దేశ సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్ శక్తుల నుంచి దేశాన్ని రక్షించడం కోసం మరో స్వాతంత్ర్య సంగ్రామ పోరాటానికి ప్రజలను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తల పైనే ఉందని పిలుపు. నిచ్చారు ఈ కార్యక్రమంలో రంగా హనుమంతరావు వేమి రెడ్డి శ్రీనివాస్ రడ్డి బాలరాజు రామారావు వెంకటేష్ రెడ్డి నవీన్ రెడ్డి ఇ అప్పారావు ఆదిమూలం శ్రీనివాస్ జాంగిర్ ఉద్దండుడు మిర్యాల రమణ గుప్తా వేణు విజయ్ బుచ్చి రామ్ అద్దంకి రవి బాలు నాయక్ దని కుమార్ తలుపులు వెంకటేశ్వరరావు చంటి అదేవిధంగా గాంధీ పాదం యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ సి ఐ టి అన్ని సంఘాలు పాల్గొని దిగ్విజయం చేశారని అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు