రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్యం...

Published: Friday January 07, 2022

బీరుపూర్, జనవరి 06 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల కేంద్రంలో రైతుబంధు సంబరాలు రైతులు ఘనంగా నిర్వహించారు. గుర్రాల రాజేందర్ రెడ్డి పొలంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రైతుబంధు సంబరాలు చేసుకున్నారు. జిల్లా సభ్యుడు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రాల రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతును రాజును చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. రైతును ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం 24 గంటల ఉచిత విద్యుత్ సాగునీరు పెట్టుబడి సాయం ఎకరానికి 10 వేలు రూపాయలు అందిస్తు రైతుబంధు సాయం 50 వేల కోట్లుకు చేరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు ఫోరం అధ్యక్షులు జోగినిపెల్లి  సుధాకర్ రావు సింగిల్ విండో అధ్యక్షులు ఏలేటి నర్సింహరెడ్డి ఏఈఓ వెంకటేష్ రైతుబంధు కన్వీనర్ సాయిని తిరుపతి ఉప సర్పంచ్ ఏలూరి గంగారెడ్డి కాలగిరీ గంగారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు కాలగీరి నరేశ్ రెడ్డి గంగదరి గంగారాజం కాయితి శేఖర్ రెడ్డి రైతులు రాజేశం మల్లయ్య 50 మంది మహిళా రైతులు పాల్గొన్నారు.