సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఇల్లందులపాడు గ్రామం నందు ఉచిత "పశు గర్భకోశ వైద్య శిబిరం" విజయ

Published: Tuesday March 07, 2023
మధిర, మార్చి 6 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలో ఇల్లందులపాడు గ్రామం నందు, శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గర్భకోశ వైద్య (ఫెర్టిలిటీ) చికిత్స శిబిరం నిర్వహించినారు.ఈ శిబిరంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీమతి ఉమా కుమారి గారి సమక్షంలో ఎదకురాని పడ్డలు, చూడి పరీక్షలు, గర్భకోశ వ్యాధులు, తిరిగి పొర్లే పశువులకు, చికిత్సలు చేసి ఉచితంగా మందులు, మినరల్ మిక్చర్, క్యాల్షియం టానికులు అందజేసినారు.
ఈ పశు వైద్య శిబిరంలో పశుపోషకులను ఉద్దేశించి వైద్యాధికారి మాట్లాడుతూ, గర్భకోశ వ్యాధుల రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవిలో చూడి పశువుల పట్ల ఎండ తీవ్రత నుండి సంరక్షణ, పెంపకం మీద తీసుకోవాల్సిన మెలకువలు, బలవర్ధకమైన పశు గ్రాసాల ప్రాముఖ్యతను గురించి వివరించనైనది.ఈ వైద్య శిబిరంలో సత్యసాయి సేవా సమితి జిల్లా ఆర్థిక సహకారంతో సభ్యులు కోనా మోహన్ రావు, కన్వీనర్ మురళీకృష్ణ, వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ లక్ష్మణరావు, గోపాల మిత్రులు, సురేష్ వల రాజు, వెంకటకృష్ణ, పశుపోషకులు సూర్యదేవర కృష్ణయ్య తాళ్లూరి సత్యనారాయణ రాజారావు ఖమ్మంపాడు ప్రసాదు పాల్గొన్నారు.