విద్యార్థుల సంఖ్యకు బట్టి ఉపాధ్యాయులను నియమించాలి : టీపీటీఎఫ్ డిమాండ్

Published: Friday October 29, 2021

బీరుపూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలంలోని టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో మండలంలో వివిధ పాఠశాలలను సందర్శించి సభ్యత్వన్నీ నమోదు చేశారు. రాష్ట్ర కౌన్సిలర్ గొడుగు రఘుపతి యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన సంఖ్యకు బట్టి ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు కల్పించి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు కూరగాయల చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ రకాల పోస్టుల్లో ఉన్న ఖాళీల భర్తీని టిఆర్టీ నోటిఫికేషన్ జారిచేసి బదిలీల పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ బీరుపూర్ మండల అధ్యక్షడు చిర్నేని రాజిరెడ్డి ప్రధాన కార్యదర్శు కడారి ప్రకాష్ నాగభూషణం లచ్చన్న శ్రీనివాస్ భీమరాజు స్వాతి తదితరులు పాల్గొన్నారు.